గురువారం 21 జనవరి 2021
Business - Nov 26, 2020 , 18:08:23

స్థిరంగా బంగారం, వెండి ధ‌ర‌లు

స్థిరంగా బంగారం, వెండి ధ‌ర‌లు

న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ‌ బంగారం, వెండి ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పులేమీ చోటుచేసుకోలేదు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇవాళ్టి ట్రేడింగ్‌లో 10 గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.17 పెరిగి రూ.48,257కు చేరింది. క్రితం ట్రేడింగ్‌లో 10 గ్రాముల 24 క్యార‌ట్ ప‌సిడి ధ‌ర రూ.48,240 వ‌ద్ద ముగిసింది. ఇక‌, వెండి ధ‌ర‌ల్లో కూడా పెద్ద‌గా మార్పేమీ లేదు. ఢిల్లీలో కిలో వెండి ధ‌ర రూ.28 పెరిగి రూ.59,513కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.59,485 వ‌ద్ద ముగిసింది. కాగా, అంత‌ర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1815 అమెరిక‌న్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 23.42 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది. ‌  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo