సోమవారం 26 అక్టోబర్ 2020
Business - Sep 23, 2020 , 18:21:02

మ‌రింత దిగొచ్చిన బంగారం ధ‌ర‌లు

మ‌రింత దిగొచ్చిన బంగారం ధ‌ర‌లు

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధ‌ర‌లు వ‌రుస‌గా మూడో రోజూ త‌గ్గుముఖం ప‌ట్టాయి. లాక్‌డౌన్ స‌మ‌యంలో భారీగా పెరిగి ఒక ద‌శ‌లో రూ.56 వేల‌కు చేరుకున్న బంగారం ధ‌ర‌లు ఇప్పుడు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. బుధ‌వారం నాటి ట్రేడ్‌లో దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం రూ.614 త‌గ్గి రూ.50,750కి చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డంతో దేశీయంగా కూడా ప‌సిడి ధ‌ర‌లు దిగి వ‌చ్చాయ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ విశ్లేష‌కులు వెల్ల‌డించారు. 

కాగా, గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.51,364 వ‌ద్ద ముగిసింది. వెండి ధ‌ర‌లు కూడా భారీగా త‌గ్గాయి. బుధ‌వారం నాటి ట్రేడింగ్లో కిలో వెండి ధ‌ర రూ.1898 త‌గ్గి రూ.59,720కి చేరుకుంది. గ‌త ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.61,618 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఔన్స్‌ ప‌సిడి ధ‌ర రూ.1874, ఔన్స్ వెండి ధ‌ర‌ రూ.23.26 ప‌లికింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo