శనివారం 30 మే 2020
Business - Apr 27, 2020 , 08:16:50

అక్ష‌య తృతియ నాడు భారీగా త‌గ్గిన ప‌సిడి అమ్మ‌కాలు

అక్ష‌య తృతియ నాడు భారీగా త‌గ్గిన ప‌సిడి అమ్మ‌కాలు

క‌రోనా ఎఫెక్ట్ బంగారం అమ్మ‌కాల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా నిన్న‌ అక్ష‌య తృతీయా ఉన్నా కూడా బంగారం అమ్మ‌కాలు 95శాతం క్షీణించాయ‌ని గోల్డ్‌స‌మాఖ్య పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా కేవ‌లం 5శాతం మాత్ర‌మే ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేశార‌ని వారు  వివ‌రించారు. అయితే లాక్‌డౌన్‌, పెరిగిన బంగారం ధ‌ర‌లు కొనుగోలుదారుల‌ను ప్ర‌భావితం చేశాయ‌ని తెలిపారు. దీంతో కొనుగోళ్లు త‌గ్గాయ‌ని పేర్కొన్నారు. అటు పెళ్లిళ్లు లేక‌పోవ‌డం మ‌రో కార‌ణంగా కూడా చెప్పారు. ద‌స‌రా, దీపావ‌ళీ నాటికి ప‌సిడి అమ్మ‌కాలు మ‌ళ్లీ ఊపందుకుంటాయ‌ని చెబుతున్నారు.logo