స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి

న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో పసిడి ధరల్లో పెద్దగా మార్పులేమీ జరుగలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కేవలం రూ.45 పెరిగి రూ.48,273కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు కొద్దిగా పుంజుకోవడమే ఇవాళ ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. కాగా, గత ట్రేడ్‌లో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.48,228 వద్ద ముగిసింది.
ఇక, వెండి ధరలు కూడా బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. కిలో వెండి ధర రూ.407 పెరిగి రూ.59,380కి చేరింది. గత ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.58,973 వద్ద ముగిసింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1812 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.34 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
- మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు