మంగళవారం 20 అక్టోబర్ 2020
Business - Sep 25, 2020 , 18:50:10

పెరిగిన బంగారం ధ‌ర‌లు

పెరిగిన బంగారం ధ‌ర‌లు

న్యూఢిల్లీ: ‌దేశంలో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.324 పెరిగి రూ.50,824కు చేరింది. గ‌త నాలుగు రోజులుగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌రలు శుక్ర‌వారం పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు పెరుగ‌డ‌మే దేశీయంగా బంగారం ధ‌ర‌లు పెరుగ‌డానికి కార‌ణ‌మైందని హెచ్‌డీఎఫ్‌డీ సెక్యూరిటీస్ విశ్లేష‌కులు వెల్ల‌డించారు. 

కాగా, గురువారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.50,500 వ‌ద్ద ముగిసింది. వెండి ధ‌ర‌లు కూడా శుక్ర‌వారం స్వ‌ల్పంగా పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.2,124 పెరిగి రూ.60,536కు చేరింది. గ‌త ట్రేడింగ్‌లో కిలో వెండి ధ‌ర రూ.58,412 వ‌ద్ద ముగిసింది. కాగా, శుక్ర‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌  స్వ‌చ్ఛ‌మైన బంగారం 1873 డాల‌ర్లు, ఔన్స్ వెండి 23.10 డాల‌ర్లు ప‌లికింది.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo