పెరిగిన బంగారం ధరలు...

ముంబై: బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్( ఎంసీఎక్స్ )లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49వేలు క్రాస్ చేసింది. గతవారం రూ.48వేల దిగువకు వచ్చిన పసిడి ఇప్పుడు రూ.50వేల సమీపానికి చేరుకుంది. ప్రారంభ సెషన్లో పెరిగిన బంగారం ధర ఆ తర్వాత కాస్త క్షీణించింది. అయినప్పటికీ రూ.49వేలపైన ఉంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి రూ.7,000 తక్కువగా ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.63,000 క్రాస్ చేసింది.
ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో రూ.17వేలు తక్కువగా ఉన్నది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ రూ.22.00అంటే -0.04శాతం క్షీణించి రూ.49,280 పలికింది. 49,415.00 వద్ద ప్రారంభమై, ఇదే ధర వద్ద గరిష్టాన్ని తాకింది. రూ.49,258.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం బంగారం రూ.200కు పైగా పెరిగినప్పటికీ, ఆ తర్వాత క్షీణించింది. గత నాలుగు రోజుల్లో రూ.1500కు పైగా పెరిగింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.169.00 అంటే 0.34శాతం పెరిగి రూ.49,421 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,460.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,460.00 గరిష్టాన్ని, రూ.49,460.00 కనిష్టాన్ని తాకింది.
తాజావార్తలు
- వీడీసీసీతో సమస్యలుండవ్
- పారిశ్రామిక వాడలో పచ్చదనం
- పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి
- స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
- సామాన్యుడిలా సంజయ్‌కుమార్
- వచ్చే నెల ఒకటి నుంచి ‘కేసీఆర్ కప్' టోర్నీ
- ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే పోటీలు
- ఊర చెరువుకు పైపులైన్ వేయించాలి
- రాయపేట రిజర్వాయర్ నుంచి నీటిని ఇవ్వాలి