బుధవారం 03 జూన్ 2020
Business - May 19, 2020 , 09:48:07

కొండెక్కిన పసిడి ధరలు

కొండెక్కిన పసిడి ధరలు

హైదరాబాద్‌ : పసిడి ధర పరుగులు పెడుతోంది. సామాన్యుడికి అందనంత దూరంలో.. బంగారం ధరలు కొండెక్కాయి. పసిడి ధరలు ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయి. అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా, జపాన్‌ దేశాల బలహీన ఎకానమిక్‌ డేటా ఇవన్నీ కలిసి పసిడి ధరను భారీగా పెంచేశాయి. దీనికి తోడు కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అన్ని ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పసిడి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. 10 గ్రాముల బంగారం రూ. 50 వేలకు చేరుకుంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న బులియన్‌ ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,865కు చేరుకుంది. ఇక వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. కిలో వెండి ధర మూడు శాతం పెరిగి రూ.48,208ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,408కి చేరుకుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,510గా ఉంది. అంటే బంగారం ధరలు రూ. 50 వేలకు చేరువలో ఉన్నాయి. 


logo