శనివారం 30 మే 2020
Business - May 18, 2020 , 18:39:55

రికార్డు స్థాయికి బంగారం ధరలు

రికార్డు స్థాయికి బంగారం ధరలు

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు భారీగా పెరుగడంతో ఆ ప్రభావం భారత్‌లో బంగారం ధరలపై పడింది. అమెరికా, చైనాల వాణిజ్య ఉద్రిక్తతలు, మరోవైపు ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం పడుతుండటంతో ట్రేడర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మన దేశంలో బంగారం ధర సోమవారం కూడా భారీగా పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1 శాతం పెరిగి రూ.47,961 వద్ద ట్రెండింగ్ అవుతున్నది. ఇక వెండి కూడా అదే బాటలో పరుగులు పెడుతున్నది. కిలో వెండి ధర 5 శాతం పెరిగి రూ.48,999 వద్ద ట్రేడ్ అవుతున్నది.

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఏడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సోమవారం బంగారం ధర 1 శాతం పెరిగి ఔన్సు ధర 1759.98 డాలర్లకు చేరుకుంది, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్‌లోనూ 0.5 శాతం పెరిగి ఔన్స్ బంగారం 1765.70 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. 2012 అక్టోబర్ తర్వాత బంగారం ధర అత్యధికంగా పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్లాటినం 0.7 శాతం, వెండి ధరలు 2 శాతం పెరిగాయి. ఈ ఏడాది ప్రపంచ మార్కెట్లో బంగారం ధర 16 శాతం పెరిగింది. 


logo