మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 08, 2020 , 12:52:04

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

ముంబై: మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో బంగారం ధర బుధవారం స్వల్పంగా తగ్గింది. నేటి ఉదయం సెషన్‌లో 10 గ్రాముల బంగారం రూ.150 నష్టపోయి రూ.48,650 వద్ద ట్రేడ్ అయ్యింది. నిన్నటి ట్రేడింగ్‌లో రూ.575 పెరిగిన తర్వాత బంగారం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అంతేగాక‌ ఆర్థిక వ్యవస్థలో రికవరీ ఆశలతో రిస్క్‌ అసెట్స్ అయిన‌ ఈక్విటీల కొనుగోలుకు మొగ్గుచూపారు. ఆ కార‌ణంగానే బం‍గారం ధర దిగి వచ్చింద‌ని బులియన్ మార్కెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo