బుధవారం 20 జనవరి 2021
Business - Nov 17, 2020 , 18:19:57

స్థిరంగా బంగారం ధ‌ర‌.. రూ.450 పెరిగిన వెండి

స్థిరంగా బంగారం ధ‌ర‌.. రూ.450 పెరిగిన వెండి

న్యూఢిల్లీ: ‌దేశ రాజ‌ధాని ఢిల్లీలో మంగ‌ళ‌వారం బంగారం ధ‌రలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర‌ కేవ‌లం రూ.3 పెరిగి రూ.50,114కు చేరింది. గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.50,111 వ‌ద్ద ముగిసింది. ఇక వెండి ధ‌రలు మంగ‌ళ‌వారం నాటి ట్రేడింగ్‌లో స్వ‌ల్పంగా పెరిగాయి. కిలో వెండి ధ‌ర‌ రూ.451 పెరిగి రూ.62,023 చేరింది. క్రితం ట్రేడింగ్‌లో కిలో వెండి ధ‌ర రూ.61,572 వ‌ద్ద ముగిసింది. ఇదిలావుంటే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర రూ.1,877, ఔన్స్ వెండి ధ‌ర రూ.24.20 ప‌లికింది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo