ఆదివారం 07 మార్చి 2021
Business - Dec 29, 2020 , 15:13:46

వ‌చ్చే ఏడాది బంగారం రూ.63 వేల‌కు చేరనుందా?

వ‌చ్చే ఏడాది బంగారం రూ.63 వేల‌కు చేరనుందా?

ముంబై: 2020లో క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌ను ముంచ‌డం.. ప‌సిడికి బాగా కలిసొచ్చింది. ఎప్పుడు ఏ సంక్షోభం వ‌చ్చినా.. బంగారాన్ని ఓ సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డిగా ఇన్వెస్ట‌ర్లు చూస్తారు. దీంతో ఈ ఏడాది గోల్డ్‌కు ఎక్క‌డ లేని డిమాండ్ ఏర్ప‌డింది. ఎంత‌లా అంటే ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర జీవిత‌కాల గ‌రిష్ఠ‌మైన రూ.56,191ని తాకింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌క్కువ వ‌డ్డీ రేట్లు, మార్కెట్‌లో భారీగా అందుబాటులో ఉన్న లిక్విడిటీతో బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. అయితే ఈ ట్రెండ్‌ వ‌చ్చే ఏడాది కూడా కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ద‌ని, ప‌సిడి మ‌రింత మెరుస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

వ్యాక్సిన్ వ‌చ్చినా.. ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకున్నా..

క‌రోనాకు వ్యాక్సిన్లు వ‌స్తున్నా.. క్ర‌మంగా అన్ని దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కోలుకుంటున్నా బంగారానికి మాత్రం డిమాండ్ త‌గ్గ‌లేద‌ని కామ్‌ట్రెండ్స్ రిస్క్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ సీఈవో జ్ఞాన‌శేఖ‌ర్ త్యాగ‌రాజ‌న్ అన్నారు. దీనికి కార‌ణం భారీ ఉద్ధీప‌న ప్యాకేజీలే అని ఆయ‌న చెప్పారు. వీటి వ‌ల్ల డాల‌ర్ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని, బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డానికి ఇది కార‌ణ‌మ‌వుతుంద‌ని త్యాగ‌రాజ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాదు అమెరికాలో సెనేట్‌లో బ‌ల‌హీన మెజార్టీ సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డానికి కొత్త అధ్య‌క్షుడు జో బైడెన్‌కు అడ్డుగా మారుతుంద‌ని, ఇది కూడా బులియ‌న్ మార్కెట్ పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని ఆయన అన్నారు. వీటి కార‌ణంగా బంగారం ధ‌ర ప‌ది గ్రాములు రూ.60 వేల వ‌ర‌కు వెళ్తుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు చెప్పారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియ‌ర్ అన‌లిస్ట్ త‌ప‌న్ ప‌టేల్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. బంగారం ధ‌ర రూ.63 వేల‌ను కూడా తాక‌వ‌చ్చ‌ని ఆయ‌న అంటున్నారు. 

ఇవి కూడా చ‌దవండి

ఇండియాలో కొత్త ర‌కం క‌రోనా.. హైద‌రాబాద్‌లో ఇద్ద‌రికి

జ‌య‌హో ర‌హానే.. ఈ పొట్టివాడు చాలా గ‌ట్టివాడే

బైడెన్ డిజిట‌ల్ స్ట్రాట‌జీ టీమ్‌లో క‌శ్మీరీ యువ‌తి

కిడ్నాప్ చేసి.. మ‌తం మార్చి.. పాకిస్థాన్‌లో అరాచకం

VIDEOS

logo