గురువారం 28 మే 2020
Business - Apr 28, 2020 , 18:48:05

మ‌ళ్లీ దిగివ‌చ్చిన బంగారం ధరలు

మ‌ళ్లీ దిగివ‌చ్చిన బంగారం  ధరలు

ముంబై :ప‌సిడి ధ‌ర‌లు మ‌ళ్లీ దిగివ‌చ్చాయి. కరోనా ఎఫెక్ట్‌తో కొద్దిరోజులుగా భగ్గుమన్న‌బంగారం ధరలు వరుసగా రెండో రోజూ త‌గ్గాయి. స్టాక్‌ మార్కెట్లు  లాభాల బాట పట్టడం, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్‌ల నుంచి సడలింపులు ప్రకటిస్తుండటంతో పసిడి ధరల జోరుకు బ్రేక్‌ పడింది.  పదిగ్రాముల బంగారం రూ. 286 తగ్గి రూ. 45,905 పలికింది. ఇక కిలో వెండి రూ. 400 పతనమై రూ. 41,558కి తగ్గింది. వివిధ కరెన్సీలతో డాలర్‌ మారకం విలువ పెరగడంతో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బంగారం ధరలు  ఒడిదుడుకులు కొనసాగినా మున్ముదు బంగారం ధరలు నిలకడగా పెరుగుతాయని బులియన్‌ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. కాగా పలు దేశాలు ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు చేపడుతున్న ఉద్దీపన ప్యాకేజ్‌లతో మార్కెట్ వ‌ర్గాలు షేర్ల కొనుగోలుకు మొగ్గుచూపడంతో హాట్‌ మెటల్స్‌కు ఆదరణ కొంతమేర తగ్గిందని భావిస్తున్నారు.

  


logo