ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Jan 22, 2021 , 19:24:27

బిగ్‌ రిలీఫ్‌ : భారీగా తగ్గిన బంగారం

బిగ్‌ రిలీఫ్‌ : భారీగా తగ్గిన బంగారం

న్యూఢిల్లీ :  కొండెక్కిన బంగారం ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పతనంతో పాటు రూపాయి బలపడటంతో శుక్రవారం పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 716 రూపాయలు తగ్గి 48,763 రూపాయలకు దిగిరాగా, కిలో వెండి ఏకంగా 1600 రూపాయలు పతనమై 65,700 రూపాయలకు తగ్గింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పదిగ్రాముల బంగారం 519 రూపాయలు దిగివచ్చి 49,140 రూపాయలు పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు క్షీణిస్తున్నాయి.

కరోనా వ్యాక్సిన్ల రాకతో ఆర్థిక వ్యవస్ధపై చిగురించిన అంచనాలతో పాటు అమెరికాలో నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టడంతో యల్లోమెటల్‌కు డిమాండ్‌ పడిపోయింది. అయితే బంగారం ధరల తగ్గుదల తాత్కాలికమేనని, ఏప్రిల్‌ తొలివారానికి బంగారం ధరలు 60,000 రూపాయలకు ఎగబాకుతాయని ముంబై జ్యూవెలర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కుమార్‌ జైన్‌ అంచనా వేశారు. 

VIDEOS

logo