గురువారం 28 మే 2020
Business - Apr 14, 2020 , 11:30:27

వరుసగా ఐదో రోజూ పెరిగిన‌ బంగారం ధరలు

వరుసగా ఐదో రోజూ పెరిగిన‌ బంగారం ధరలు

బంగారం ధర రికార్డు ధరకు చేరుకుంటోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర ఈ రోజు కూడా అదే దిశగా పరుగెడుతోంది. బంగారంతో పాటు వెండి కూడా ప్రియం అవుతోంది. బంగారం ధరలు పది గ్రాములకు 400 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు వెండి ధరలు కూడా కేజీకి 150 రూపాయల పెరుగుదల కనబరిచాయి.  బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 410 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,840 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 400 రూపాయల పెరుగుదలతో 44,500 రూపాయలు నమోదు చేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే రానున్న కొన్ని రోజుల్లోనే బంగారం ధర రూ.50 వేలకు చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


logo