Business
- Jan 23, 2021 , 19:52:52
VIDEOS
దిగివచ్చిన బంగారం ధరలు

ముంబై : చుక్కలను తాకి సామాన్యుడికి దూరమైన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రక్రియ ఊపందుకోవడం, ఆర్థిక వ్యవస్ధ కోలుకుంటుందనే సంకేతాలతో పసిడి ధరలు నేలచూపులు చూస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీ మార్కెట్లోనూ పసిడికి డిమాండ్ తగ్గింది. ఎంసీఎక్స్‌లో శనివారం పదిగ్రాముల బంగారం 258 రూపాయలు తగ్గి 49190 రూపాయలు పలికింది. ఇక 576 రూపాయలు తగ్గిన కిలో వెండి 66724 రూపాయలు పలికింది.
తాజావార్తలు
MOST READ
TRENDING