మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 03, 2020 , 00:18:53

పసిడి మరింత ప్రియం

పసిడి మరింత ప్రియం
  • రూ.391 పెరిగిన తులం ధర
  • రూ.713 అధికమైన కిలో వెండి

న్యూఢిల్లీ, మార్చి 2: గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొనడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్‌ కూడా తోడవడంతో ధరలు అమాంతం పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.391 ఎగబాకి రూ.42,616 పలికింది. పసిడితో వెండి మరింత పుంజుకున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి రూ.713 పెరిగి రూ.46,213 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు అమాంతం పెరుగడం వల్లనే దేశీయంగా అధికమయ్యాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఉన్నతాధికారి తపన్‌ పటేల్‌ తెలిపారు. న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,604 డాలర్లకు, వెండి 17 డాలర్లకు చేరుకున్నాయి. గతవారంలో 1,585 డాలర్లుగా ఉన్నాయి. 


logo
>>>>>>