బుధవారం 03 జూన్ 2020
Business - May 18, 2020 , 23:51:12

రికార్డుస్థాయికి బంగారం

రికార్డుస్థాయికి బంగారం

  • రూ.47,700 పలికిన తులం ధర

న్యూఢిల్లీ, మే 18: బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. వరుసగా రెండోరోజు సోమవారం ఎంసీఎక్స్‌ మార్కెట్లో తులం ధర రూ.47,740 పలికింది. వరుసగా రెండు రోజుల్లో గోల్డ్‌ ధర ఏకంగా రూ.4 వేలు ఎగబాకినట్టయింది. కిలో వెండి ధర మూడు శాతం పెరిగి రూ.48,053కు చేరింది. దేశీయంగా బంగారం ధర పెరుగడానికి అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.   స్టాక్‌ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నకొద్దీ మదుపరులు బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడిగా చూడటం మొదలు పెట్టారు. దీనివల్ల డిమాండ్‌ భారీ స్థాయిలో పెరిగిపోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు ఏడేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. వచ్చే ఏడాది వరకు అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశాలు లేవని యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వు చీఫ్‌ హెచ్చరించడంతో ఔన్స్‌ గోల్డ్‌ ధర ఒక శాతం పెరిగి 1,759.98 డాలర్లు పలికింది. అక్టోబర్‌ 2012 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి.   


logo