బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Feb 06, 2020 , 00:12:14

రూ.41 వేల దిగువకు పసిడి రూ.396 తగ్గిన తులం ధర

రూ.41 వేల దిగువకు పసిడి రూ.396 తగ్గిన తులం ధర

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అతి విలువైన లోహాలకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ పడిపోవడంతో బంగారం ధర ఏకంగా రూ.41 వేల దిగువకు పడిపోయింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,871 వద్ద ముగిసింది. మంగళవారం రూ.41,267 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. పసిడితోపాటు వెండి కూడా మరింత బలహీనపడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో కిలో వెండి ధర రూ.179 తగ్గి రూ.46,881కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం ధరలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణమని బులియన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా పుంజుకోవడంతో మదుపరులు తమ పెట్టుబడులను వీటివైపు మళ్లించడం కూడా ధరలు తగ్గడానికి మరో కారణమన్నారు. న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,554 డాలర్ల వద్ద ఉండగా, వెండి 17.70 డాలర్లుగా నమోదయ్యాయి. 


logo