మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Aug 01, 2020 , 03:30:58

56 వేల దిశగా పసిడి

56 వేల దిశగా పసిడి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: పసిడి ధర దూసుకుపోతున్నది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర మరో 680 రూపాయలు పెరిగి రూ.54,540 పలికింది. హైదరాబాద్‌లో తులం ధర రూ.220 అధికమై రూ.55,820కి చేరుకున్నది. గడిచిన పది రోజుల్లో  రూ.4 వేలు ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అంతకంతకు పెరుగుతుండంతో దేశీయంగా కూడా మరింత ప్రియమవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు పసిడితోపాటు వెండి పరుగులు తీస్తున్నది. కిలో వెండి ధర రూ.2,850 ఎగబాకి రూ.65,900 పలికింది. గురువారం రూ.63 వేలుగా ఉన్నది. న్యూయా ర్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,976 డాలర్లు, వెండి 24 డాలర్లు పలికింది. 


logo