బుధవారం 03 మార్చి 2021
Business - Feb 09, 2021 , 17:24:58

మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌

మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌

హైద‌రాబాద్‌: ‌బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. గ‌త కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ తిరిగి పుంజుకోవ‌డంతో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.495 పెరిగి రూ.47,559కి చేరుకుంది. గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.47,064 వ‌ద్ద ముగిసింది. ఇటీవ‌ల కేంద్ర‌ బడ్జెట్ అనంతరం దేశంలో పసిడి ధరలు భారీగా క్షీణించాయి. దాదాపు రూ.2000 వ‌ర‌కు తగ్గాయి. ఒక ద‌శ‌లో 99.9 స్వ‌చ్ఛ‌త క‌లిగిన బంగారం ధ‌ర రూ.47,000 కంటే దిగువ‌కు వ‌చ్చింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో పాజిటివ్ ట్రెండ్ కార‌ణంగా బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. 

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.640 పెరిగి రూ.48,710కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.590 పెరిగి రూ.44,650కి చేరుకుంది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోల్చితే రూ.7,490 తక్కువగా ఉంది. అయితే, వెండి ధర ఇవాళ స్వ‌ల్పంగా త‌గ్గింది. కిలో వెండిపై రూ.99 త‌గ్గి రూ.68,391కి చేరుకుంది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి రూ.68,490 వ‌ద్ద ముగిసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo