సోమవారం 01 మార్చి 2021
Business - Jan 22, 2021 , 00:23:56

పసిడి పరుగు

పసిడి పరుగు

  • తులం ధర మరో రూ.575 పెరుగుదల
  • రూ.1,220 ఎగిసిన కిలో వెండి

న్యూఢిల్లీ, జనవరి 21: ఒకవైపు ఈక్విటీ మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుంటే.. మరోవైపు బంగారం, వెండి ధరలు కూడా దూసుకుపోతున్నాయి. గురువారం న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల పసిడి ధర రూ.575 ఎగబాకి రూ.49,125 పలికింది. దేశీయంగా ఊపందుకున్న కొనుగోళ్లకు గ్లోబల్‌ ట్రెండ్‌ కూడా తోడవడంతో ధరలు పరుగులు పెడుతు న్నాయని హెచ్‌డీఎఫ్‌సీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ళ మద్దతుతో కిలో వెండి ఏకంగా రూ.1,220 ఎగబాకి రూ.66,670 లకు చేరింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,870.50 డాలర్లు, వెండి 25.83 డాలర్లు పలుకుతున్నది.

VIDEOS

logo