ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 18, 2021 , 00:58:37

పసిడికి మళ్లీ డిమాండ్‌!

పసిడికి మళ్లీ డిమాండ్‌!

గతేడాది కరోనా వైరస్‌ కారణంగా వెలవెలబోయిన పసిడి అమ్మకాలు కొత్త సంవత్సరంలో తిరిగి పుంజుకోగదలవని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. పసిడి వినిమయంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో గతేడాది అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరల వల్ల సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి వెనుకంజవేశారు. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు, పండుగ సీజన్‌లో ఆభరణాల కొనుగోలును వాయిదావేసుకున్నారని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఎండీ సోమసుందరం తెలిపారు. ప్రస్తుతం వినియోగదారుల్లో సెంటిమెంట్‌ మెరుగుపడుతున్నదని, దీంతో పుత్తడి కొనుగోళ్లు ఊపందుకుంటాయని ఆయన చెప్పారు.

VIDEOS

logo