పసిడికి రెక్కలు

- తులంపై రూ.810 పెరుగుదల
- రూ.3 వేలకుపైగా ఎగబాకిన వెండి
న్యూఢిల్లీ: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై అమెరికా ఫెడరల్ రిజర్వు ఆందోళన వ్యక్తం చేయడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లిస్తున్నారు. దీంతో పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర మంగళవారం రూ.810 పెరిగి రూ.49,430 పలికింది. అంతకుముందు ఈ ధర రూ.48,610గా ఉన్నది. పసిడితోపాటు వెండి కూడా రూ.3 వేలకుపైగా పెరిగి కొనుగోలుదారులకు జంకుపుట్టించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ళ మద్దతుతో మంగళవారం కిలో వెండి ఏకంగా రూ.3,060 ఎగబాకి రూ.64,360కి చేరుకున్నది. అంతర్జాతీయ ధరలకు తోడు దేశీయంగా పెళ్ళిళ్ళ సీజన్ కూడా తోడవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని బులియన్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.760 ఎగబాకి రూ.50,070 పలికింది. గత పది రోజుల్లో ఇంచుమించు రూ.2 వేల వరకు అధికమైంది. అలాగే కిలో వెండి ధర రూ.2,500 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,864 డాలర్లు పలుకగా, వెండి 24.52 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నది.
తాజావార్తలు
- భారత సాంప్రదాయాల గుర్తింపుకు లౌకికవాద ముప్పు: యోగి
- వ్యవసాయ చట్టాలపై నిరసన హోరు : హర్యానా రైతు బలవన్మరణం!
- రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- 10 కోట్లతో అయోధ్యలో కర్నాటక గెస్ట్‌హౌజ్
- భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉంది : హోంమంత్రి
- ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ ప్రారంభం..బంపర్ ఆఫర్లు
- మధ్యాహ్న భోజన మహిళా కార్మికులకు సన్మానం
- మమతపై పోటీకి సై.. 12న సువేందు నామినేషన్
- రేపటి నుంచి పూర్తిస్థాయిలో రాజ్యసభ సమావేశాలు
- తిండి పెట్టే వ్యక్తి ఆసుపత్రిపాలు.. ఆకలితో అలమటించిన వీధి కుక్కలు