ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Business - Aug 12, 2020 , 02:21:57

దిగొచ్చిన పసిడి

దిగొచ్చిన పసిడి

  • తులంపై రూ.1,300 తగ్గుదల
  • రూ.3 వేలు తగ్గిన కిలో వెండి

న్యూఢిల్లీ: రాకెట్‌ వేగంతో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిన పసిడి మంగళవారం భారీగా తగ్గింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.1,310 తగ్గి రూ.54,760కి పరిమితమైంది. అంతక్రితం రోజు ధర రూ.56 వేలుగా ఉన్నది. పసిడితోపాటు వెండి భారీగా పడిపోయింది. హైదరాబాద్‌లో కూడా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.440 తగ్గి రూ.58,030కి చేరుకున్నది. గడిచిన మూడు రోజుల్లో వెయి రూపాయలకు పైగా తగ్గినట్లు అయింది. కిలో వెండి ధర ఇంచుమించుగా రూ.3 వేలు తగ్గి రూ.73,600కి పరిమితమైంది. గతంలో ఇది రూ.76,540గా ఉన్నది.  న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,989 డాలర్లకు పడిపోగా, వెండి 27.90 డాలర్లుగా నమోదైంది.


logo