సోమవారం 01 మార్చి 2021
Business - Jan 10, 2021 , 02:57:09

వన్నె తగ్గినపసిడి ధరలు

వన్నె తగ్గినపసిడి ధరలు

  • ఒక్కరోజే రూ.1,300లకుపైగా పతనం
  • జాతీయ, అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కదలాడటం
  • కరోనా వ్యాక్సిన్‌తో మారిన పెట్టుబడుల స్వరూపం
  • కరెన్సీ మార్కెట్‌లో అమెరికా డాలర్లకు పెరుగుతున్న మద్దతు
  • గోల్డ్‌ నుంచి ఈక్విటీ మార్కెట్లకు తరలిపోతున్న పెట్టుబడులు
  • విపణిలోకి డిమాండ్‌ కంటే పెరుగుతున్న సరఫరా
  • అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలు
  • జో బైడెన్‌ పాలనలో అగ్రరాజ్యఆర్థిక వ్యవస్థకు మరిన్ని ఉద్దీపనలు వస్తాయన్న అంచనాలు
  • మెరుగవుతున్న అంతర్జాతీయ సంబంధాలు

న్యూఢిల్లీ, జనవరి 9: బంగారం ధరలు పడిపోతున్నాయి. కొద్దిరోజుల కిందటిదాకా రికార్డు పరుగులు పెట్టిన పసిడి.. ఇప్పుడు పతనం వైపు పయనిస్తున్నది. ఢిల్లీలో శనివారం 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.52,850కి దిగింది. శుక్రవారంతో పోల్చితే రూ.1,310 తగ్గినైట్లెంది. నాడు రూ.54,160గా ఉన్నది. ఇక ఆభరణాలకు అనువైన 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,650 నుంచి రూ.48,450కి వచ్చింది. దీంతో ఒక్కరోజులో రూ.1,200 పడిపోయినైట్లెంది. హైదరాబాద్‌లోనూ శనివారం 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.50,500, 22 క్యారెట్లు రూ.46,300లకు దిగివచ్చింది. శుక్రవారం ఇవి రూ.51,800, రూ.47,500లుగా ఉన్నాయి. గ్లోబల్‌, ఫ్యూచర్‌ మార్కెట్లలోనూ ధరల క్షీణత కొనసాగుతున్నది. అసలు ఈ స్థాయిలో పుత్తడి ధరలు ఎందుకు తగ్గుముఖం పడుతున్నాయన్న కారణాల విషయానికొస్తే..

వెండి ధరలూ పసిడి బాటలోనే

వెండి ధరలూ పసిడి బాటనే అనుసరిస్తున్నాయి. ఢిల్లీలో శనివారం ఒక్కరోజే కిలో ధర రూ.6వేలు పడిపోయి రూ.63,900లకు చేరింది. శుక్రవారం రూ.69,900లుగా ఉన్నది. హైదరాబాద్‌లోనూ కిలో వెండి ధర శనివారం రూ.5,500 దిగి రూ.69వేలకు తగ్గింది. శుక్రవారం రూ.74,500 పలికింది. 


VIDEOS

తాజావార్తలు


logo