గురువారం 04 మార్చి 2021
Business - Feb 13, 2021 , 03:02:00

దిగొస్తున్న పసిడి

దిగొస్తున్న పసిడి

  • తులంపై రూ.660 తగ్గుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ పడిపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలపడుతుండటంతో బంగారం ధర వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో శుక్రవారం మరో రూ.660 తగ్గి రూ.47 వేల దిగువకు చేరుకున్నది. ధర రూ.46,850గా ఉన్నది. అంతక్రితం ధర  రూ.47,500గా ఉన్నది. దేశీయంగా డిమాండ్‌ లేకపోవడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. పసిడితోపాటు వెండి మరింత చౌకైంది. కిలో వెండి రూ.340 తగ్గి రూ.67,900గా ఉన్నది. న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,815 డాలర్లకు తగ్గగా, అదే వెండి 26.96 డాలర్ల వద్ద నిలిచింది. 


VIDEOS

logo