బుధవారం 03 మార్చి 2021
Business - Feb 23, 2021 , 17:56:30

పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

న్యూఢిల్లీ: ‌దేశంలో గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు ఇవాళ‌ పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇవాళ 99.9 స్వ‌చ్ఛ‌త క‌లిగిన 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.337 పెరిగి రూ.46,372కు చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.46,035 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో బంగారం ధ‌ర‌లు రాత్రికి రాత్రే పెరిగిపోవ‌డంతో దేశీయంగాను బంగారం ధ‌ర‌ల‌పై ప్ర‌భావం ప‌డింద‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. 

ఇక వెండి ధ‌ర కూడా ఇవాళ‌ భారీగానే పెరిగింది. కిలో వెండి రూ.1149 పెరిగి రూ.69,667కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.68,518 వ‌ద్ద ముగిసింది. ఇదిలావుంటే ఇవాళ అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1,808 అమెరిక‌న్ డాల‌ర్‌లు, ఔన్స్ వెండి ధ‌ర 28.08 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లికింది. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరిక‌న్ డాల‌ర్‌తో పోల్చితే రూపాయి మార‌కం విలువ కాస్త బ‌ల‌హీన‌ప‌డటం కూడా ఇవాళ బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణ‌మైంది.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo