శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Business - Aug 05, 2020 , 18:55:11

భారీగా పెరిగిన బంగారం ధ‌ర!‌

భారీగా పెరిగిన బంగారం ధ‌ర!‌

ముంబై: బ‌ంగారం ధ‌ర‌లకు రెక్క‌లొచ్చాయి. గ‌త కొంత‌కాలంగా బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు పెరగ‌డ‌మే త‌ప్ప త‌గ్గుద‌ల క‌నిపించ‌డంలేదు. తాజాగా బుధ‌వారం కూడా దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధ‌ర ఏకంగా రూ.1365 పెరిగింది. దాంతో క్రితం ట్రేడ్‌లో రూ.54,816 వ‌ద్ద ముగిసిన బంగారం ధ‌ర.. ఇవాళ్టి ట్రేడ్‌లో అమాంతం రూ.56,181కి చేరింది. అంతర్జాతీయ స్థాయిలో బంగారంపై పెట్టుబ‌డులు పెరుగడ‌మే బంగారం ధ‌ర‌లు పెరుగ‌డానికి కార‌ణ‌మ‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. 

అటు, వెండి ధ‌ర‌లు కూడా బుధ‌వారం నాటి ట్రేడ్‌లో భారీగా పెరిగాయి. కిలో వెండి ధ‌ర ఒక్క‌రోజే ఏకంగా రూ.5,972 పెరిగింది. దాంతో గ‌త ట్రేడ్‌లో రూ.66,754 వ‌ద్ద ముగిసిన కిలో వెండి ధ‌ర ఇవాళ‌ రూ.72,726కు చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్లో సైతం ఔన్స్ బంగారం ధ‌ర 2,032 అమెరిక‌న్ డాల‌ర్లు పెరుగ‌గా.. ఔన్స్ వెండి ధ‌ర 26.40 అమెరిక‌న్ డాల‌ర్లు పెరిగింది.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo