కరోనా ఎఫెక్ట్: పసిడికి తగ్గిన గిరాకీ

న్యూఢిల్లీ: మన దేశ కరంట్ ఖాతా లోటు (సీఏడీ)లో ముడి చమురు తర్వాత స్థానం బంగారానిదే. కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల గత ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకు డిమాండ్ లేక పసిడి దిగుమతులు 40 శాతం తగ్గిపోయాయని కేంద్ర వాణిజ్యశాఖ వర్గాలు తెలిపాయి. అంటే 12.3 బిలియన్ డాలర్లకు బంగారం దిగుమతులు పడిపోయాయని ఆ వర్గాల కథనం. గత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 20.6 బిలియన్ డాలర్ల మేరకు రికార్డయ్యాయి.
అయితే, గతేడాదితో పోలిస్తే నవంబర్ నెలలో బంగారం దిగుమతులు 2.65 శాతం పెరిగి 3 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇక వెండి దిగుమతులు కూడా ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో 65.7 శాతం తగ్గి 752 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. దీంతోపాటు జెమ్స్ అండ్ జ్యువెల్లరీ దిగుమతులు గత ఎనిమిది నెలల కాలంలో 14.3- బిలియన్ల డాలర్లకు (44 శాతం) పడిపోయాయి.
తగ్గిన పసిడి, వెండి దిగుమతులు దేశీయ వాణిజ్యలోటు దిగి రావడానికి కారణమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సం ఏప్రిల్-నవంబర్ మధ్య వాణిజ్య లోటు 113.42 బిలియన్ డాలర్ల నుంచి 42 బిలియన్ డాలర్లకు కుంచించుకుపోయింది. దేశీయంగా జ్యువెల్లరీ ఆభరణాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో భారత్ అతిపెద్ద పసిడి దిగుమతిదారుగా నిలిచింది. ప్రతియేటా 800-900 టన్నుల పసిడి దిగుమతి అవుతుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఎన్ఎస్ఈలో లోపం ఊహించలేదు.. బట్ భారీ మూల్యం చెల్లించాం!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!