సోమవారం 08 మార్చి 2021
Business - Jan 20, 2021 , 17:36:52

స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు

స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల బ‌రువుగ‌ల 24 క్యార‌ట్ బంగారం రూ.347 పెరిగి రూ.48,758కి చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.48,411 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయ స్థాయిలో విలువైన లోహాల ధ‌ర పెరుగ‌డం ఇవాళ ప‌సిడి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరుగ‌డానికి కార‌ణ‌మ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. 

ఇక వెండి ధ‌ర‌లు కూడా బుధ‌వారం నాటి ట్రేడింగ్‌లో స్వ‌ల్పంగా పెరిగాయి. కిలో బంగారం ధ‌ర రూ.606 పెరిగి రూ.65,814కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.65,208 వ‌ద్ద ముగిసింది. కాగా, అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1,854 అమెరిక‌న్ డాల‌ర్‌లు, ఔన్స్ వెండి ధ‌ర 25.28 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లికింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo