సోమవారం 01 మార్చి 2021
Business - Jan 05, 2021 , 17:31:40

స్వ‌ల్పంగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌

స్వ‌ల్పంగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌

న్యూఢిల్లీ: దేశంలో ప‌సిడి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్‌లో మంగ‌ళ‌వారం 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.335 పెరిగి రూ.50,969కి చేరింది. గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల 24 క్యారట్‌ బంగారం ధ‌ర రూ.50,634 వ‌ద్ద ముగిసింది. డాల‌ర్‌తో పోల్చితే రూపాయి మార‌కం విలువ త‌గ్గ‌డ‌మే ఇవాళ్టి ప‌సిడి ధ‌ర పెరుగుద‌ల‌కు కార‌ణ‌మ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. 

పసిడితోపాటే వెండి ధ‌ర‌లు కూడా ఇవాళ స్వ‌ల్పంగా పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.382 పెరిగి రూ.69,693కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.69,311 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1,942 అమెరికన్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 27.30 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo