స్వల్పంగా తగ్గిన పసిడి ధర

న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.141 తగ్గి రూ.48,509కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,650 వద్ద ముగిసింది. మార్కెట్లలో నిన్నటి బలహీనమైన ట్రెండే ఇవాళ కూడా కొనసాగడంతో పసిడి ధర స్వల్పంగా తగ్గిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు చెబుతున్నారు.
ఇదిలావుంటే వెండి ధర ఇవాళ స్వల్పంగా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.43 పెరిగి రూ.66,019కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.65,976 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,853.26 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.55 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.