సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 11, 2020 , 23:41:54

గోల్డ్‌ ఈటీఎఫ్‌ల జోరు

గోల్డ్‌ ఈటీఎఫ్‌ల జోరు
  • జనవరిలో రూ.200 కోట్ల పెట్టుబడులు
  • గత ఏడేండ్లలో ఇదే అత్యధికం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ పండ్‌(ఈటీఎఫ్‌)లు జోరుమీదున్నాయి. జనవరిలో ఏకంగా 200 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చాయి. గత ఏడేండ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి, మందకొడి పరిస్థితులు నెలకొనడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన వాటివైపు మళ్లించారు. వరుసగా మూడు నెలలుగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలోకి నిధులు చొప్పిస్తున్నారు. తాజాగా అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(ఆంఫీ) వెల్లడించిన సమాచారం ఆధారంగా గత నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌లోకి రూ.202 కోట్ల మేర నిధులు కుమ్మరించారు. అంతక్రితం ఏడాది కేవలం రూ.27 కోట్లు మాత్రమే. అక్టోబర్‌లో రూ.31.45 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోగా..ఆ మరుసటి నెలలో రూ.7.68 కోట్లు చొప్పించారు. సెప్టెంబర్‌లో రూ.44 కోట్లు, ఆగస్టులో రూ.145 కోట్లు పెట్టుబడులు పెట్టారు. డిసెంబర్‌ 2012లో పెట్టిన రూ.474 కోట్ల తర్వాత ఇదే అత్యధికం. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు పెట్టుబడిదారులను ఆకట్టుకుంటున్నాయనడానికి ఈ నిధులే నిదర్శణం, డిసెంబర్‌లో రూ.27 కోట్ల నిధులు చొప్పించిన ఇన్వెస్టర్లు, ఆ మరుసటి నెలలో రూ.200 కోట్లకు పైగా నిధులు కుమ్మరించారు అని మార్నింగ్‌ స్టార్‌ సీనియర్‌ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. logo