శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 28, 2021 , 21:54:32

పుత్త‌డికి వ‌న్నె త‌గ్గిందా? 35% త‌గ్గిన గిరాకీ

పుత్త‌డికి వ‌న్నె త‌గ్గిందా? 35% త‌గ్గిన గిరాకీ

లండ‌న్‌: మార్కెట్‌లో అనిశ్చిత ప‌రిస్థితులు నెల‌కొన్నా.. డాల‌ర్ విలువ ప‌డిపోయినా ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డి మార్గం పుత్త‌డి.. అలాగే భార‌త్‌లో అతివ‌లు వీలైతే పండుగ‌లు, వేడుక‌ల‌కు బంగారం కొన‌కుండా.. ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌కుండా ఉండ‌లేరు. కానీ 2020లో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారితో బంగారానికి డిమాండ్ కొడిగ‌ట్టింది. దీనికి తోడు కొవిడ్-19 నియంత్ర‌ణ‌కు ప‌లు దేశాలు విధించిన లాక్‌డౌన్‌తో అనేక పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కొనుగోళ్లు లేక వ్యాపారాల‌న్నీ వెలవెలబోయాయి.  నెలల తర‌బ‌డి పెండ్లిండ్లు, శుభకార్యాలు లేకపోవడంతో దేశంలో పుత్త‌డికి గిరాకీ కూడా తగ్గింది. 

క‌రోనాతో స్టాక్‌మార్కెట్లు ప‌త‌న‌మై ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డి మార్గంగా ప‌సిడి ముందుకు రావ‌డంతో దాని ధ‌ర‌లు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లాయి. 2020లో పుత్త‌డి ధ‌ర‌లు 25 శాతం పెరిగాయ‌ని ప్ర‌పంచ స్వ‌ర్ణ మండ‌లి (డ‌బ్ల్యూజీసీ) తెలిపింది. ఫ‌లితంగా 11 ఏండ్ల దిగువ స్థాయికి ప‌సిడి గిరాకీ ప‌డిపోయింది. 2019తో పోలిస్తే 2020లో భారత్‌లో బంగారానికి 35 శాతం డిమాండ్ త‌గ్గింద‌ని గురువారం వివ‌రించింది డ‌బ్ల్యూజీసీ. 2

019లో దేశంలో 690.4 టన్నుల బంగారం అమ్ముడైతే 2020లో గిరాకీ ప‌డిపోయి 35.34 శాతానికి తగ్గి 446.4 టన్నులుగా నమోదైంది. 2019లో రూ. 2,17,770 కోట్ల విలువ గ‌ల పుత్తడి అమ్ముడుపోతే.. గతేడాది ఈ విలువ 14శాతం తగ్గి రూ. 1,88,280కోట్లుగా ఉంది. మ‌రోవైపు నగలకూ గిరాకీ 42 శాతం తగ్గి 315.9 టన్నుల‌కు ప‌రిమిత‌మైంది. 

ఇత‌ర దేశాల దేశీయ పసిడి దిగుమతి కూడా భారీగా తగ్గాయి. 2019లో 646.8 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా.. గతేడాది ఇది 344.2 టన్నుల‌కే ప‌రిమిత‌మైంది. అయితే గతేడాది చివరిలో లాక్‌డౌన్‌ నిబంధనల‌ సడలింపు, సాధారణ కార్యకలాపాలు మళ్లీ గాడిన‌లో పడటంతో 2020 చివ‌రి త్రైమాసికంలో దిగుమతులు కాస్త పెరిగాయని డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం తెలిపారు.

అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికంలో పండుగలు, పెండ్లిండ్లు జ‌రుగ‌డంతో బంగారానికీ కొంచెం గిరాకీ పెరిగింద‌న్నారు. ప్రస్తుతం క‌రోనా వ్యాక్సినేష‌న్ రావ‌డంతో పరిస్థితులు క్ర‌మంగా గాడిలో ప‌డుతుండ‌టంతోపాటు ‘హాల్‌మార్క్‌ తప్పనిసరి’ వంటి ప్రభుత్వ సంస్కరణలతో 2021లో బంగారం విక్ర‌యాలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని డ‌డ్ల్యూజీసీ అంచ‌నా వేసింది.

‘2009లోనూ పసిడికి ఒక్కసారిగా గిరాకీ తగ్గి తర్వాత మళ్లీ పుంజుకుంది. ఇప్పుడూ అదే జరగొచ్చు. అయితే ప్రస్తుతం అధిక పన్నులతో బంగారం స్మగ్లింగ్‌ పెరిగే ప్రమాదముంది. అందువల్ల హేతుబ‌ద్ధ‌మైన సుంకాలు విధించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు పసిడి రీసైక్లింగ్‌పై పన్ను రాయితీలు ఇవ్వాలి’అని సోమసుందరం వ్యాఖ్యానించారు. ఇక అంత‌ర్జాతీయంగా కూడా 2019తో పోలిస్తే 2020లో 14 శాతం త‌గ్గిన పుత్త‌డి డిమాండ్ 3,759.6 ట‌న్నుల‌కు చేరుకున్న‌ది. 2009లో త‌ర్వాత 4000 ట‌న్నుల దిగువ‌కు ప‌డిపోవ‌డం ఇదే మొద‌టిసారి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo