శనివారం 15 ఆగస్టు 2020
Business - Jul 02, 2020 , 17:48:16

త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

న్యూఢిల్లీ: గ‌త కొన్ని రోజులుగా పైపైకే పోతున్న బంగారం, వెండి ధ‌ర‌లు శుక్ర‌వారం కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. అంత‌ర్జాతీయ మార్కెట్లో డిమాండ్ కొంత త‌గ్గ‌డం, డాల‌ర్‌తో పోల్చితే రూపాయి మార‌కం విలువ మెరుగుపడ‌టం లాంటి ప‌రిణామాలు ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూర‌టీస్ సీనియ‌ర్ అన‌లిస్ట్ త‌ప‌న్ పటేల్ చెప్పారు. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.488, కిలో వెండి ధ‌ర రూ.1168 త‌గ్గింది. 

ప్రీవియ‌స్ ట్రేడ్‌లో 10 గ్రాముల‌ బంగారం ధ‌ర రూ.49,623 వ‌ద్ద ముగియ‌గా, ఇవాళ్టి ట్రేడ్‌లో రూ.49,135 వ‌ద్ద ముగిసింది. బుధవారం 51,494 వ‌ద్ద ముగిసిన బంగారం ధ‌ర కూడా గురువారం నాటి ట్రేడ్‌లో రూ.1168 త‌గ్గి 50,326కు ప‌రిమిత‌మైంది. గురువారం ట్రేడ్‌లో అమెరికా డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ 56 పైస‌లు మెరుగుపడి రూ.75.04 వ‌ద్ద స్థిర ప‌డ‌టంతో బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గాయ‌ని అన‌లిస్టులు చెబుతున్నారు. ‌

కాగా, ప్ర‌స్తుతం అంత‌‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1769.4 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లుకుతుండ‌గా, ఔన్స్ వెండి ధ‌ర 17.90 అమెరిక‌న్ డాల‌ర్లుగా ఉన్న‌ది. ‌


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo