సోమవారం 01 మార్చి 2021
Business - Jan 27, 2021 , 17:09:28

త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బుధ‌వారం 99.9 స్వ‌చ్ఛ‌త క‌లిగిన 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.231 త‌గ్గి రూ.48,421కి చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.48,652 వ‌ద్ద ముగిసింది. గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో వీక్ ట్రెండ్ కార‌ణంగా ఇవాళ దేశీయ మార్కెట్‌లలో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. 

ఇక వెండి ధ‌ర‌లు కూడా దేశీయంగా స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి ధ‌ర రూ.256 త‌గ్గి రూ.65,614కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.65,870 వ‌ద్ద ముగిసింది. ఇదిలావుంటే ఇవాళ అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1,850.50 అమెరిక‌న్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 25.41 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

తాజావార్తలు


logo