బుధవారం 03 జూన్ 2020
Business - May 11, 2020 , 05:12:03

నేటి నుంచి గోల్డ్‌బాండ్ల విక్ర‌యం

నేటి నుంచి గోల్డ్‌బాండ్ల విక్ర‌యం

న్యూఢిల్లీ: 2020 - 21 ఆర్థిక సంవ‌త్స‌రంలో రెండో విడుత గోల్డ్ బాండ్ల‌ను ఈ రోజు నుంచి విక్ర‌యించ‌నున్నారు. మే 15వ తేదీ వ‌ర‌కు గోల్డ్‌బాండ్లు కొనే అవ‌కాశం ఉంటుంది. గ్రాము బంగారం ధర రూ. 4,590గా నిర్ణ‌యించారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా బంగారం కొన్నవారికి రూ.50 రాయితీ ల‌భిస్తుంది. కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ఈ బాండ్లను జారీ చేస్తుంది. ప్ర‌స్తుతం బంగారానికి విప‌రీత‌మైన డిమాండ్ క‌నిపిస్తుంది. బ‌య‌ట బంగారం దుకాణాలు మొత్తం లాక్‌డౌన్ కార‌ణంగా మూసి ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్త‌న గోల్డ్‌బాండ్ల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని ఆర్థిక‌ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.


logo