సోమవారం 18 జనవరి 2021
Business - Dec 02, 2020 , 11:51:37

మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు...

మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు...

ముంబై: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. బుధవారం ప్రారంభ సెషన్ లో ఫ్యూచర్ మార్కెట్లో మళ్లీ ఎగిశాయి. నిన్నకూడా పసిడి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. మంగళవారం బంగారం రూ.700 వరకు, వెండి రూ.3000కు పైగా పెరిగింది. పసిడి ఈ రెండు రోజుల్లో రూ.900 పెరగగా, వెండి రూ.3,300 వరకు పెరిగింది. ఆగస్ట్ 7వ తేదీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి ధరలు రూ.7800 తక్కువగా ఉన్నాయి. వెండి ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో పోలిస్తే రూ.17వేలకు పైగా తక్కువగా ఉంది.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.211.00 అంటే 0.44శాతం పెరిగి రూ.48,486.00 వద్ద ట్రేడ్ అయింది. కాగా, క్రితం సెషన్(డిసెంబర్ 1) లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.694.00 అంటే 1.45 శాతం పెరిగి రూ.48,486.00 వద్ద ముగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.662.00 అంటే 1.38శాతం ఎగిసి రూ.48,580.00 వద్ద ముగిసింది. బంగారం ధర రెండు రోజుల్లో రూ.900 పెరిగింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.