మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 05, 2021 , 01:30:47

హైదరాబాద్‌ నుంచి మాల్దీవులకు గోఎయిర్‌ డైరెక్ట్‌ ఫ్లెట్‌

హైదరాబాద్‌ నుంచి మాల్దీవులకు గోఎయిర్‌ డైరెక్ట్‌ ఫ్లెట్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4: హైదరాబాద్‌ నుంచి నేరుగా మాల్దీవులకు తమ తొలి విమాన సర్వీసును గోఎయిర్‌ ప్రకటించింది. వారానికి నాలుగుసార్లు హైదరాబాద్‌-మాలే మధ్య డైరెక్ట్‌ ఫ్లైట్‌ నడుస్తుందని గురువారం గోఎయిర్‌ తెలియజేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో నిలిచిపోయిన విమానయాన సేవలు మళ్లీ పూర్తిస్థాయిలో విస్తరిస్తున్న వేళ.. ఇప్పటికే మాలే-ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు మధ్య డైరెక్ట్‌ ఫ్లైట్లను గోఎయిర్‌ ప్రారంభించింది. 

స్పెషల్‌  ప్యాకేజీలు

హైదరాబాద్‌-మాలే ప్రయాణీకుల కోసం గోఎయిర్‌ ప్రత్యేక ప్యాకేజీలను పరిచయం చేసింది. స్పెషల్‌ రిటర్న్‌ ఇంట్రోడక్టరీ ఫేర్‌ (వచ్చిపోయే చార్జీ) రూ.16,882గా ఉంటుందని ప్రకటించింది. అలాగే సరసమైన ధరలకే గోహాలీడే ప్యాకేజీలుంటాయని తెలిపింది. 4 రోజుల హాలీడే (3 రాత్రులు) ట్రిప్‌ ప్రారంభ ధర రూ.26,500 అని వివరించింది. 

ఈ నెల 11 నుంచి  ప్రారంభం

సోమ, మంగళ, గురు, ఆదివారాల్లో విమాన సర్వీసులు ఉదయం 11:30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫ్లైట్‌ జీ8 1533 విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మాల్దీవుల్లోని మాలే ఎయిర్‌పోర్టుకు చేరుతుంది.మధ్యాహ్నం 2:30 గంటలకు ఫ్లైట్‌ జీ8 4033 విమానం మాలే నుంచి మొదలవుతుంది. సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

VIDEOS

logo