సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 04, 2020 , 00:04:57

జీఎమ్మార్‌ చేతికి బీదర్‌ విమానాశ్రయం

జీఎమ్మార్‌ చేతికి బీదర్‌ విమానాశ్రయం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3: జీఎమ్మార్‌ చేతికి మరో విమానాశ్రయం వచ్చింది. ఉత్తర కర్ణాటకలో ఉన్న బీదర్‌ విమానాశ్రయాన్ని కమిషన్‌, ఆపరేషన్‌ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రాంతీయంగా విమాన సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్‌ పథకం కింద ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్‌ సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ తెలిపారు. ఈవారంలోనే ప్రారంభంకానున్న ఈ బీదర్‌ విమానాశ్రయం నుంచి తొలి విడుత బెంగళూరు నుంచి విమాన సర్వీసును నడుపనున్నట్లు చెప్పారు. బీదర్‌ చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న కృషిలో మేము కూడా భాగస్వామ్యం అయ్యామని, ఇది చాలా సంతోషకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం ప్రారంభంకానుండటంతో ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లు కానున్నదన్నారు. 
logo