Business
- Dec 30, 2020 , 01:26:32
VIDEOS
మధుమేహానికి కాంబినేషన్ డ్రగ్

- రూ.14కే అందుబాటులోకి తెచ్చిన గ్లెన్‌మార్క్
న్యూఢిల్లీ: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. దేశంలో టైప్-2 డయాబెటిస్ చికిత్స కోసం ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) డ్రగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెమోగ్లిఫ్లోజిన్ ఎటాబొనేట్, విల్డాగ్లిప్టిన్లతో కూడిన ఈ టాబ్లెట్ రూ.14కే లభ్యమవుతుందని ఆ కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ైగ్లెసెమిక్ నియంత్రణను మెరుగుపర్చుకునేందుకు రోగులు రోజుకు రెండుసార్లు ఈ టాబ్లెట్‌ను తీసుకోవాలని సూచించింది. గత నెలలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందిన ఈ మందును రెమో-వీ, రెమోజెన్-వీ అనే రెండు బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.
తాజావార్తలు
MOST READ
TRENDING