శుక్రవారం 07 ఆగస్టు 2020
Business - Jul 12, 2020 , 01:00:15

ఐపీవోకి గ్లాండ్‌ ఫార్మా

ఐపీవోకి గ్లాండ్‌ ఫార్మా

న్యూఢిల్లీ, జూలై 11: హైదరాబాద్‌ కేంద్రస్థానంగా ఔషధాల తయారీ సంస్థ గ్లాండ్‌ ఫార్మా స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా(డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌)ను దాఖలు చేసింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) రూట్‌లో 3.4 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ.1,250 కోట్ల నిధులను సేకరించాలని సంస్థ భావిస్తున్నది.  చైనాకు చెందిన ఫార్మా సంస్థ ఫోసన్‌ ఫార్మా స్యూటికల్స్‌ నిర్వహణలో నడుస్తున్న గ్లాండ్‌ ఫార్మా ఐపీవోకి రావడం గమనార్హం. విక్రయించనున్న షేర్లలో ఫోసన్‌ ఫార్మాకు చెందిన 1,93,68,686 షేర్లు కాగా, గ్లాండ్‌ సెల్సస్‌ బయో కెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 1,00,47,435 షేర్లు, ఎంపవర్‌ డిక్రిటియోనరీ ట్రస్ట్‌కు చెందిన 35,73,014 షేర్లు, నిలయ్‌ డిక్రిటియోనరీ ట్రస్ట్‌కు చెందిన 18,74,500 షేర్లు ఉన్నాయి. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.5 వేల కోట్ల నిధులు సమీకరించాలని సంస్థ భావిస్తున్నది. 


logo