శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 16, 2020 , 00:52:12

మాంద్యం గుప్పిట్లోకి జర్మనీ

మాంద్యం గుప్పిట్లోకి జర్మనీ

బెర్లిన్‌, ఏప్రిల్‌ 15: ఐరోపా ఆర్థిక చోదక శక్తి జర్మనీ.. మాంద్యం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. గత నెలలోనే జర్మనీ ఆర్థిక పరిస్థితులు మాంద్యం కోరల్లో చిక్కుకున్నట్లు బుధవారం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  వ్యాపార-పారిశ్రామిక రంగాల్లో విక్రయాలు, ఉత్పత్తి నిలిచిపోగా.. మదుపరులు పెట్టుబడులకు భయపడుతున్నారు. ఇటీవల 1.1 లక్షల కోట్ల యూరోల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినా ఫలితం లేకుండా పోతున్నది. 7.25 లక్షల సంస్థలు ఆర్థిక సాయాన్ని కోరుతుండగా, దాదాపు 21 లక్షల మంది కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 


logo