మంగళవారం 14 జూలై 2020
Business - Jun 05, 2020 , 00:47:56

రూ.50 కోట్లతో విస్తరణ

రూ.50 కోట్లతో విస్తరణ

  • జినోమ్‌ ల్యాబ్‌ ఈడీ అశోక్‌ కుమార్‌

హైదరాబాద్‌: ప్రముఖ ఆయుర్వేద ఔషధాల తయారీ సంస్థ జినోమ్‌ ల్యాబ్‌ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నది. హైదరాబాద్‌కు సమీపంలోని తుర్కపల్లి వద్ద ఉన్న ప్లాంట్‌ సామర్థ్యాన్ని పెంచడానికి రూ.50 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. రోజుకు 5 వేల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్లో ప్రస్తుతం 300 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా,  కొత్తగా మరో 200 మందిని నియమించుకునే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. రోగ నిరోధక శక్తిని పెంచే పలు రకాల ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేశారు. నాలుగు రకాల్లో లభించనున్న వీటిలో తులసి, దాల్చిన చెక్క, శొంఠి, నల్ల మిరియాలతో రూపొందించిన ఆయుష్‌ క్వాత్‌గా వ్యవహరించనున్న ఈ ఫార్ములేషన్‌తో శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతున్నదన్నారు. ఒక్కో బాటిల్‌ ధర రూ.150గా నిర్ణయించింది.  సామాజిక బాధ్యతలో భాగంగా జీహెచ్‌ఎంసీ, పోలీసులకు ఈ నాలుగు రకాల ఉత్పత్తులను ఉచితంగా పంపిణి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 


logo