విడుదల చేసిన బజాజ్ హెల్త్‌కేర్
న్యూఢిల్లీ, మే 4: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బజాజ్ హెల్త్‌కేర్.. మార్కెట్లోకి ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ జనరిక్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి చికిత్స చేయడానికి ఈ ట్యాబ్లెట్లను వినియోగిస్తున్నారు. ఈ ఔషధానికి దేశీయంగా ఉత్పత్తి, మార్కెట్లో విక్రయించడానికి ఔషధ నియంత్రణ మండలి డీసీజీఐ నుంచి అనుమతిపొందినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్(ఏపీఐ) అభివృద్ధి చేయడంలో విజయం సాధించినట్లు, ఫావిపిరవిర్ ఫార్ములేషన్ తమ ఆర్అండ్డీ టీం అభివృద్ధి చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.