భారత్‌లో చివరి యూనిట్‌ను మూసివేయనున్న జనరల్ మోటార్స్

న్యూఢిల్లీ: భారత్‌లో తన కార్యకలాపాలను పూర్తిగా ముగించేందుకు జనరల్‌మోటార్స్ సిద్ధమైంది. ఈ నెల 24 న క్రిస్మస్కు ఒకరోజు ముందు భారత్‌లోని తన చివరి యూనిట్‌ను మూసివేయనున్నట్లు తెలిసింది. 1996 లో భారతదేశంలో కార్ల తయారీ కర్మాగారాన్ని జనరల్ మోటార్స్ సంస్థ ఏర్పాటు చేసింది.
2017 లో దేశీయ కార్యకలాపాలను నిలిపివేసిన జనరల్ మోటార్స్ ఇండియా.. భారతదేశంలో మిగిలి ఉన్న ఏకైక ప్లాంటులో కూడా కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. పుణేకు సమీపంలో ఉన్న తలేగావ్ ప్లాంట్‌ను భారత్‌లోని తన చివరి యూనిట్‌ను జనరల్ మోటార్స్ కంపెనీ మూసివేస్తున్నట్లు సమాచారం. తలేగావ్ ప్లాంట్ యొక్క ప్రాథమిక ఎగుమతును మెక్సికోకు ఎగుమతి చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే గుజరాత్‌లోని హలోల్ వద్ద ఉన్న ఇతర భారతీయ కర్మాగారాన్ని 2017 లో చైనా ఎస్ఏఐసీకి విక్రయించింది. దీనిని ఇప్పుడు ఎంజీ మోటార్స్ ఉపయోగిస్తున్నది. తలేగావ్ ప్లాంట్‌లో ప్రస్తుతం 1,800 మంది జీతంపై, దినసరి కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి 2021 జనవరి వరకు జీతాలు ఇవ్వగా, న్యాయ, పరిపాలనా సిబ్బంది మాత్రం 2021 మార్చి వరకు సంస్థతోనే ఉంటారు.
భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జనరల్ మోటార్స్ తన మహారాష్ట్ర కర్మాగారాన్ని చైనా యొక్క అతిపెద్ద ఎస్యూవీ తయారీ సంస్థ గ్రేట్ వాల్ మోటార్స్‌కు రూ.2,000 కోట్లకు విక్రయించాలని కోరింది. అయితే ఈ ఒప్పందాన్ని భారత్ క్లియర్ చేయలేదు. జనవరిలో వారు బైండింగ్ టర్మ్ షీట్ మీద సంతకం చేసినప్పుడు.. ఈ ఒప్పందం ప్రకటించబడింది. ఇది వచ్చే ఏడాది రెండో అర్ధ భాగంలో మూసివేసే అవకాశాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- సేవ చేస్తే శిక్ష రద్దు
- టీటా రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్ వనం