గురువారం 28 మే 2020
Business - May 17, 2020 , 23:37:06

జియోలో జనరల్‌ అట్లాంటిక్‌ పెట్టుబడి

జియోలో జనరల్‌ అట్లాంటిక్‌ పెట్టుబడి

  • రూ.6,598 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన అమెరికా సంస్థ

న్యూఢిల్లీ, మే 17: ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికం వెంచర్‌ జియోలో మరో అమెరికా సంస్థ పెట్టుబడులు పెట్టింది. ఇదివరకే ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌, విస్టా ఈక్విటీ సంస్థలు వాటాలను కొనుగోలు చేయగా..తాజాగా జనరల్‌ అట్లాంటిక్‌ 1.34 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఒప్పందం విలువ రూ.6,598.38 కోట్లు. దీంతో గడిచిన నాలుగు వారాల్లో జియో రూ.67,194.75 కోట్ల నిధులను సేకరించినట్లు అయింది. చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అప్పులు రూ.68 వేల కోట్ల వరకు తగ్గనున్నాయి. జియోలో 20 శాతం వరకు వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించిన ముకేశ్‌ అంబానీ ఇప్పటి వరకు 14.8 శాతం వాటాను విక్రయించారు. దీంట్లో ఫేస్‌బుక్‌ 9.99 శాతం వాటా కొనుగోలు చేయగా, సిల్వర్‌ లేక్‌ 1.15 శాతం,  విస్టా ఈక్విటీ పార్టనర్‌ 2.32 శాతం చొప్పున కొనుగోలు చేశాయి. 


logo