బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jun 27, 2020 , 09:19:22

మినీ ఇ-స్కూటర్‌ మిసో..ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే

మినీ ఇ-స్కూటర్‌ మిసో..ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే

న్యూఢిల్లీ:  జెమోపాయ్ ఎలక్ట్రిక్ తన కొత్త మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ మిసోను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇ-స్కూటర్‌ మిసో  ధర రూ .44,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.  స్కూటర్  ప్రీ-బుకింగ్స్ ప్రారంభించామని వచ్చే నెల నుంచి కస్టమర్లకు వీటిని అందజేయడం ప్రారంభిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో జెమోపాయ్.. మిసో ప్రీ-బుకింగ్స్‌పై రూ .2,000 ప్రారంభ డిస్కౌంట్‌  కూడా అందిస్తోంది.

ఒక సీటు మాత్రమే కలిగిన మినీ స్కూటర్‌ను ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచచు. మిసో గరిష్ఠ వేగం  గంటకు 25 కిలోమీటర్లే.  48V / 1kW   లియాన్ బ్యాటరీని రెండు గంటల్లోనే 90% రీఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లలో లభించనుంది. 


logo