బుధవారం 15 జూలై 2020
Business - May 27, 2020 , 00:15:15

వాట్సాప్‌తో గ్యాస్‌ బుకింగ్‌

వాట్సాప్‌తో గ్యాస్‌ బుకింగ్‌

  • బీపీసీఎల్‌ నుంచి సరికొత్త సేవలు

ముంబై, మే 26: ఇకపై వాట్సాప్‌ నుంచి కూడా వంటగ్యాస్‌ సిలిండర్‌ను బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది దేశంలో రెండో అతిపెద్ద ఇంధన విక్రయ ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌). కస్టమర్లకు వినూత్న సేవలు అందిస్తున్న సంస్థ..తాజాగా ఈ నూతన సేవలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం సంస్థకు 7.1 కోట్ల మంది ఎల్‌పీజీ వినియోగదారులు ఉన్నారు. కంపెనీ వెబ్‌సైట్‌లో రిజిస్టార్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌ నంబర్‌ ‘1800224344’ ద్వారా తమ సిలిండర్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చునని సూచించింది. ఈ సందర్భంగా కంపెనీ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ సింగ్‌ మాట్లాడుతూ...కస్టమర్‌ మరింత సులభతరంగా గ్యాస్‌ సిలిండర్‌ను బుకింగ్‌ చేసుకునే చర్యల్లో భాగంగా ఈ నూతన సేవలకు శ్రీకారం చుట్టినట్లు, డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు లు, యూపీఐ, అమెజాన్‌ ద్వారా చెల్లింపులు జరుపుకునే అవకాశం కూడా కల్పించినట్లు చెప్పారు.  


logo