హైదరాబాద్, ఆగస్టు 18: హైదరాబాద్‌కు చెందిన 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్..తొలిసారిగా ‘గేమర్ షార్ట్స్’ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గేమింగ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త యాప్‌ను విడుదల చేసినట్లు కంపెనీ ఎండీ మారుతి శంకర్ తెలిపారు.
ఈ గేమర్ షార్ట్స్ యాప్‌లో 25 సులభమైన గేమ్స్ ఉన్నాయని, ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఆయన సూచించారు. భవిష్యత్తులో యాపిల్ మొబైల్‌ను వినియోగిస్తున్నవారికి కూడా ఈ యాప్ అందబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి 25 గేమ్స్ అందిస్తుండగా, త్వరలో మరో 25 నూతన గేమ్స్‌ని కూడా ఈ యాప్ ద్వారా అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.